పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన
NEWS Sep 07,2025 09:36 pm
పినపాక మండలంలో రేపు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా జానంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు సూచించారు.