వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ తెలిపారు. కావున ప్రజలకు ముందస్తు సమాచార నిమిత్తం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.