నిమజ్జనానికి వెళ్తున్న సమయంలో పటాకులు పేలి తీవ్ర గాయాలు
NEWS Sep 07,2025 06:51 pm
మల్లాపూర్ మండల ముత్యంపేట గ్రామంలో వినాయకుని నిమజ్జనం కోసం తీసుకెళ్తున్న సమయంలో పటాకులు పేస్తుండగా ప్రమాదవశాత్తు చిట్యాల అరవింద్ (20)కు తీవ్ర గాయాలు అయ్యాయి. మెట్ పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాదుకు తరలించారు డాక్టర్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.