పదవి కన్నా రైతుల ప్రయోజనాలే ముఖ్యం
NEWS Sep 07,2025 05:26 pm
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అధికార పార్టీలో ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాడుతానని ప్రకటించారు. లాలూచీ పడే వ్యక్తిని కానని, ఒకవేళ తనకు పదవి ఇస్తే తీసుకోనంటూ పేర్కొన్నారు. పదవుల కంటే ప్రజా సేవతోనే తనకు ఎక్కువ సంతృప్తి లభిస్తుందని చెప్పారు ఎమ్మెల్యే.