రంపచోడవరం మండలంలో రహదారి బీభత్సం
NEWS Sep 07,2025 04:08 pm
రంపచోడవరం మండలంలోని బోలగొండ పంచాయతీ పరిధిలోని పందిరిమామిడి – వైరామవరం రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో స్థానికుల రాకపోకలకు తీవ్రమైన ఆటంకం కలుగుతోంది. ముఖ్యంగా ఉడుంగండి వద్ద రహదారి మొత్తం బీటలు వారిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైరామవరం వైపు వెళ్లే బస్సులు, ఇతర వాహనాలు నేరుగా ప్రయాణం చేయలేక తాళ్లపాలెం మీదుగా వాడపల్లి మార్గాన్ని అవలంబించాల్సి వస్తోంది. ఇక బోలగొండ గ్రామం చివరలోని కల్వర్టు వద్ద కోండకాలువ నీటి తాకిడికి గండికొట్టడంతో అక్కడ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. కల్వర్టు రహదారి మధ్యలో ఏర్పడిన రంధ్రం వలన వాహనాలు జారిపడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.