8న అరకు ఎమ్మెల్యే అనంతగిరి పర్యటన
NEWS Sep 07,2025 05:03 pm
అరకులోయ శాసనసభ్యులు రేగం మత్స్యలింగం సెప్టెంబర్ 8 సోమవారం నాడు అనంతగిరి మండలంలో అనంతగిరి, కోనాపురం పంచాయతీలలో పర్యటించనున్నారు.అనంతగిరి మండల కేంద్రంలో మండల పరిషత్, ఎన్ఆర్ఈజీఎస్ ,జెడ్పి నిధులతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రం-1ను ఎమ్మెల్యే ప్రారంభించి, అనంతరం కోనాపురం పంచాయతీలో పర్యటిస్తారు. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ లు, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఎంపీపీ శెట్టి నీలవేణి, అనంతగిరి పార్టీ అధ్యక్షులు కొర్రా సూర్యనారాయణ,స ర్పంచ్ గూబాయి అప్పలమ్మ లు కోరారు.