గోపవరంలో అదికర్మయోగి గ్రామ సభ
NEWS Sep 07,2025 09:38 pm
రంపచోడవరం మండలం తామరపల్లి పంచాయతి పరిధిలోని గోపవరం గ్రామంలో ఆది కర్మయోగి కార్యక్రమం సర్పంచ్ మిర్తివాడ ఆనంద్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముసురుమిల్లి ఎంపీటీసీ సభ్యుడు వంశి కుంజం పాల్గొని గ్రామ అభివృద్ధి అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపవరం ఒకప్పుడు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందినప్పటికీ, ఇప్పటికీ ఆ నిధులతో ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తికాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధి పనులు ‘నాడు–నేడు’ పథకంలో సగం వరకు మాత్రమే పూర్తయ్యాయని, పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.