అక్రమ కట్టడాల తొలగింపుపై వివాదం
NEWS Sep 07,2025 04:00 pm
అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం రాజవరం గ్రామంలో ఆదివారం ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కట్టడాల తొలగింపు అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ అధికారులు తాము కోరుకున్నట్టే అక్రమ కట్టడాలను గుర్తిస్తున్నారని విమర్శించారు. చిన్న నాన్ ట్రైబల్స్, అమాయక ఆదివాసీల నిర్మాణాలనే జాబితాలో చేర్చుతూ, పెద్ద నాన్ ట్రైబల్స్ నిర్మించిన విస్తారమైన అక్రమ కట్టడాలను మాత్రం ఎంక్రోచ్మెంట్ లిస్ట్‌లో నమోదు చేయకపోవడం తీవ్ర అన్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.