మండల పరిషత్ అభివృద్దికి నిధులివ్వండి
NEWS Sep 07,2025 07:00 pm
అనంతగిరి మండల ప్రజా పరిషత్ నూతన భవనం అభివృద్ధికి, మౌలిక వసతులు కల్పనకు జిల్లా పరిషత్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా పరిషత్ సీఈఓ పోలినాయుడుని ఎంపీపీ నీలవేణి కోరారు. జిల్లా పరిషత్ సీఈవో అనంతగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయం పనితీరు,రి కార్డుల నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ నీలవేణి ,జెడ్పిటిసి గంగరాజు, సీఈవో ని మర్యాద పూర్వకంగా కలిసి, మండల అభివృద్ధిపై చర్చించారు. నూతన ప్రణాళికలు తయారు చెయ్యాలని కోరారు.