అనంతగిరి:తుప్పలు తొలగించండి
NEWS Sep 07,2025 03:58 pm
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవరాపల్లి నుండి పినకోట మీదుగా పాడేరు జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారి తీవ్రంగా దెబ్బతింది. రెండు వైపులా తుప్పలు పెరిగిపోవడంతో ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వెడల్పు చిన్నదిగా ఉండటంతో ప్రయాణం నరకం తలపిస్తోందని వారు అంటున్నారు. ముఖ్యంగా కుడియా నుంచి బుడ్డి గురువు జంక్షన్ వరకు 8 కి.మీ రహదారి పూర్తిగా శిథిలమైందని, వెంటనే అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.