ఏపీలో కూటమి సర్కార్ పేదలకు వైద్య సేవలు అందకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి బొత్స సత్య నారాయణ. ఆరోగ్యశ్రీ అందక నానా తంటాలు పడుతున్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలో రుషికొండ ప్యాలెస్ ను మెంటల్ ఆస్పత్రిగా మార్చాలంటూ కామెంట్స్ చేసిన గోవా గవర్నర్ అశోక గజపతి రాజుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుకు ఆయనకు మతి తప్పిందంటూ మండిపడ్డారు.