వాగు దాటికి ఇళ్లు కూలిపోతున్నా.. అధికారుల స్పందన లేదు
NEWS Sep 07,2025 09:26 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో పెద్ద వాగు ప్రవాహం కారణంగా తాతముత్తాతల నుండి ఉంటున్న ఇళ్లు గోదావరిలో కలిసిపోవడానికి ప్రమాదం ఏర్పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వారు తమ బాధను వెల్లడిస్తూ, వాగు దాటికి ఇళ్లు కూలిపోతున్నా అధికారులు స్పందించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. కలెక్టర్‌కు వినతి చేసినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్థులు ఆరోపించారు.