విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది
NEWS Sep 07,2025 03:08 pm
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో మండపం నిర్వాహకులు ఆలస్యంగా బయల్దేరారని అన్నారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో సమస్య నెలకొందన్నారు. ఈ సారి వినాయక విగ్రహాల ఎత్తు ఎక్కువగా ఉందని తెలిపారు. 40 ఫీట్లు కంటే ఎక్కువగా విగ్రహాలు ఉన్నాయన్నారు. గొడవలపై 5 కేసులు పెట్టామన్నారు. ట్యాంక్‌బండ్‌లో ఒకవైపు వాహనాలకు అనుమతి ఇస్తున్నామని, ఇంకా 900 విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉందని చెప్పారు .