చంద్రగ్రహణం సందర్భంగా రామయ్య ఆలయం మూసివేత
NEWS Sep 07,2025 03:09 pm
భద్రాచలం రామయ్య ఆలయాన్ని చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. మరలా సోమవారం తెల్లవారు ఝామున 3 గంటలకు తెరచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ , సుప్రభాతం , ఆరాధన , సేవా కాలం , నివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. రేపు ఉదయం 7.30 నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తామని ఆలయ ఈవో దామోదర్ తెలిపారు.