జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని జపాన్ ఎన్ హెచ్ కె పబ్లిక్ టెలివిజన్ ప్రకటించింది. గత కొంత కాలంగా తన స్వంత పార్టీ నుండి పెద్ద ఎత్తున ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. జూలై పార్లమెంటరీ ఎన్నికల్లో చారిత్రాత్మక ఓటమికి బాధ్యత వహించాలని తన పార్టీ నుండి పెరుగుతున్న పిలుపుల నేపథ్యంలో తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జూలైలో జరిగిన కీలకమైన పార్లమెంటరీ ఎన్నికల్లో 248 సీట్ల ఎగువ సభలో ఇషిబా పాలక సంకీర్ణం మెజారిటీని సాధించడంలో విఫలమైంది.