మోదీ చేతిలో ఈసీ కీలుబొమ్మ
NEWS Sep 07,2025 01:22 pm
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు చోరీ విషయంలో ఆధారాలు సమర్పించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈసీ బీజేపీ, మోదీ చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు.