నిమజ్జనం ప్రశాంతం సీఎం సంతోషం
NEWS Sep 07,2025 11:40 am
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగియడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఘనంగా వీడ్కోలు పలకడం ఆనందగా ఉందన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వహించిన పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయితీ రాజ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, ఉత్సవ కమిటీల నిర్వాహకులు, భక్తులకు థ్యాంక్స్ తెలిపారు.