మాజీ మంత్రి విడుదల రజిని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు కూటమి సర్కార్ చంపేస్తోందని ఆవేదన చెందారు. మెడికల్ కాలేజీలను అమ్మేస్తే పేద రోగుల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. పేదళ్లకే ఇబ్బంది కలుగుతుందని వాపోయారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. వైసీపీ అడ్డుకుని తీరుతుందన్నారు రజిని.