ఆసియా కప్ హాకీ ఫైనల్స్ కు భారత్
NEWS Sep 07,2025 10:36 am
ఇండియా హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. చైనాతో జరిగిన కీలక పోరులో 7-0 గోల్స్ తో దుమ్ము రేపింది. ఆసియా కప్ హాకీ ఫైనల్స్ కు చేరుకుంది. శిలానంద్ లక్రా, దిల్ ప్రీత్ సింగ్ , మన్దీప్ సింగ్ , రాజ్ కుమార్ పాల్ , సుఖ్ జీత్ సింగ్ ఒక్కో గోల్ చేయగా అభిషేక్ 46వ నిమిషంలో, 50వ సెకండ్ లో కళ్లు చెదిరేలా గోల్స్ చేశాడు. చైనా జట్టుకు చుక్కలు చూపించారు భారత ఆటగాళ్లు.