జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎంఐఎం సపోర్ట్
NEWS Sep 07,2025 08:41 am
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన చేశారు. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయాలని కోరారని, దీంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. జస్టిస్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపానని చెప్పారు.