ఇండియాకు చెందిన అనుపర్ణ రాయ్ చరిత్ర సృష్టించారు. 82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో దర్శకత్వ విభాగంలో ఉత్తమ దర్శకురాలిగా గెలుపొందారు . అనురాగ్ కశ్యప్ సమర్పణలో రాయ్ చిత్రం వెనిస్‌లోని ఒరిజోంటి విభాగంలో ఏకైక భారతీయ టైటిల్‌గా నిలిచింది .తను సాంగ్స్ ఆఫ్ పర్గాటెన్ ట్రీస్ అనే పేరుతో సినిమా తీశారు. ఇందుకు గాను అవార్డు జ్యూరీ కమిటీ ఏకగ్రీవంగా తనను బెస్ట్ డైరెక్టర్ గా ఎంపిక చేసింది.