ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేత
NEWS Sep 07,2025 08:14 am
చంద్ర గ్రహణం సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయం మూసి వేశారు. తిరిగి 8వ తేదీన సోమవారం తెల్లవారుజామున 3:00 గంటలకు తెరుస్తారు. ఉదయం 8:30 వరకు ఆలయ శుద్ధి, స్నపనాభిషేకం, అర్చన వంటి పూజా కార్యక్రమాలు చేస్తారు. 8:30 గంటల నుండి భక్తులకు అన్ని రకాల దర్శనాలు తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు ఈవో.