పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
NEWS Sep 07,2025 08:16 am
ఈ నెల 19, 20, 21 తేదీలలో నిర్వహిచబోతున్న ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్ ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. పినపాక మండల పర్యటనలో భాగంగా ఫోటోగ్రాఫర్ జిల్లా అధ్యక్షులు కీసర సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల కోసం వర్క్‌షాప్‌లు, సాంకేతిక సెషన్‌లు, ప్రత్యేక డెమోలు కూడా ఈ ఎక్స్ పోలో ముఖ్య ఆకర్షణలుగా ఉంటాయన్నారు. ఫోటో రంగం అభివృద్ధికి తోడ్పడేలా ప్రభుత్వం సహాయ ,సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక, కరక గూడెం, మణుగూరు మండలాల ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.