వేణు నక్షత్రంను సత్కరించిన మూవీ టీమ్
NEWS Sep 07,2025 12:33 am
ఎన్నారై, రచయిత, దర్శకుడు వేణు నక్షత్రం రూపొందిస్తున్న ‘ఆటాడిన పాట’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న వేణు నక్షత్రం తిరిగి అమెరికాకు వెళ్ళేందుకు సిద్ధమవుతుండగా, హీరో అభినవ్ గోమతం, చిత్రబృంద సభ్యులు సెల్వ, మహేందర్, స్వామి ముద్దం ఆయనకు ఘన సత్కారం చేశారు. త్వరలోనే సెన్సార్ పనులు పూర్తి చేసి సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రయూనిట్ వెల్లడించింది.