యూరియా కోసం రైతులు ఆందోళన పడవద్దు
NEWS Sep 07,2025 10:36 am
బుచ్చయ్యపేట మండలం గంటికొర్లం రైతు సేవా కేంద్రానికి 12.15 మెట్రిక్ టన్నులు యూరియా చేరింది. ప్రస్తుతం అక్కడ 1.260 మెట్రిక్ టన్నులు నిల్వలు ఉన్నాయి. రాజాం రైతు సేవా కేంద్రానికి 12.15 మెట్రిక్ టన్నులు యూరియా చేరగా, అందులో కొంత పంపిణీ జరగగా, 4.5 మెట్రిక్ టన్నులు మిగిలి ఉన్నాయి. గుణెంపూడి రైతు సేవా కేంద్రానికి మధ్యాహ్నం 12.015 మెట్రిక్ టన్నులు యూరియా చేరింది, ఎవరు కంగారు పడవల్సిన అవసరం లేదు అని బుచ్చయ్యపేట మండలం వ్యవసాయ అధికారి తెలిపారు .