రికార్డ్స్: లడ్డూ కావాలా బుజ్జీ..!
NEWS Sep 06,2025 10:45 pm
ఈ ఏడాది హైదరాబాద్ నగరంలో గణనాథుడి లడ్డూ వేలం పాటలు రికార్డు సృష్టించాయి. బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లావాసులు ₹ 2,31,95,000 చెల్లించి గణేష్ లడ్డూను దక్కించుకున్నారు. రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో ₹ 51.77 లక్షలు పలుకగా, బాలాపూర్ గణేశ్ లడ్డూ ₹ 35 లక్షలు పలికింది. కొత్తపేట ఏకదంత యూత్ అసోసియేషన్ 333 కిలోల లడ్డూ కోసం లక్కీ డ్రా నిర్వహించారు. 760 మంది పాల్గొన్న ఈ డ్రాలో ₹ 99 చెల్లించి టిక్కెట్ తీసుకున్న BBA విద్యార్థి సాక్షిత్ గౌడ్ అదృష్టం కలిసి వచ్చింది.