హైదరాబాద్ కొత్తపేట ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 333 కిలోల లడ్డూ కోసం లక్కీ డ్రా నిర్వహించారు. 760 మంది పాల్గొన్న ఈ డ్రాలో ₹ 99 చెల్లించి టిక్కెట్ తీసుకున్న BBA విద్యార్థి సాక్షిత్ గౌడ్ అదృష్టం కలిసి వచ్చింది. లక్కీ డ్రాలో విజేతగా నిలిచి లడ్డూను అందుకున్న సాక్షిత్ ఆనందం వ్యక్తం చేశాడు. నిర్వాహకులు లడ్డూను విద్యార్థికి అందజేశారు.