చంద్రగ్రహణం – పాటించాల్సిన ఆచారాలు
NEWS Sep 06,2025 09:54 pm
ఆదివారం జరిగే చంద్రగ్రహణం సందర్భంగా అనుసరించాల్సిన కొన్ని ఆచారాలు ఉన్నాయి. గ్రహణం ప్రారంభమయ్యే ముందు శుద్ధి కోసం స్నానం చేయడం శ్రేయస్కరం. గ్రహణం సమయంలో మంత్రజపం, రామనామం, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం పఠించడం పుణ్యప్రదం అని చెబుతారు. గ్రహణం పూర్తయ్యాక అన్నదానం, వస్త్రదానం, ధనదానం చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు. ముగిసిన వెంటనే మళ్లీ స్నానం చేసి ఇల్లు శుభ్రం చేయాలి. ఆ తర్వాతే కొత్త ఆహారం వండి తినాలి. ఇంట్లో ముందే ఉంచిన ఆహారంలో తులసి దళం వేసుకుంటే అది అపవిత్రం కాదని నమ్మకం ఉంది.