బొప్పాయి రైతులకు మద్దతు ధర హామీ
NEWS Sep 06,2025 04:17 pm
చిట్వేలి, పెనుగులూరు మండలాల్లో బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. కిలోకు 8 రూపాయల కన్నా తక్కువ కాకుండా ధర ఉండేలా చర్యలు తీసుకుంటామని, రోజువారీగా ట్రేడర్లు, ఢిల్లీ సెట్‌లతో సమావేశమై రైతులకు ధర ప్రకటిస్తామని చెప్పారు. రైతులను ఇబ్బంది పెట్టే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.