2,32,520 గణేష్ విగ్రహాల నిమజ్జనాలు
NEWS Sep 06,2025 04:04 pm
హైదరాబాద్ లో శోభా యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్బంగా గణనాథులు నిమజ్జనానికి తరలి వెళుతున్నాయి. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 2,32,520 వినాయక విగ్రహాల నిమజ్జనాలు చేశారు. అన్ని పాయింట్లలో విగ్రహాల నిమజ్జనం సాఫీగా, సురక్షితంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు కమిషనర్ కర్ణన్.