తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ రద్దు
NEWS Sep 06,2025 08:27 pm
టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమలలో 7వ తేదీన ఆదివారం చంద్ర గ్రహణం కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా శ్రీవారికి నిత్యం నిర్వహించే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా రద్దు చేయడం జరిగిందని పేర్కొంది.