భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది శ్రీశైలం ప్రాజెక్టుకు. ఈ సీజన్‌లో ఐదోసారి గేట్లు 10 అడుగుల మేర ఎత్తారు అధికారులు. ప్రస్తుత నీటిమట్టం 884.1 అడుగులు ఉండగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 210.5 టీఎంసీలుగా ఉంది. పుష్కలంగా జలాశయంలోకి నీరు చేరుతుండడంతో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.