మెట్ పల్లి మండలం వెంపేట గ్రామంలో ఆర్టీసీ బస్సు ఢీకొని బైకుపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కోరుట్ల మండలం ధర్మారం గ్రామానికి చెందిన దుంపల రాజు (28) యువకుడిగా సమాచారం. మెట్ పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.