పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతగా కృషి చేస్తున్న చిన్నారి విశ్వామిత్ర చౌహాన్‌కు ఎన్విరాన్మెంటల్ ఐకాన్ అవార్డు లభించింది. మూడేళ్లుగా నిత్యం మొక్కలు నాటుతూ “వాక్ ఫర్ ట్రీస్” కాన్సెప్ట్‌తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ఆయనను జర్నలిస్ట్ దినోత్సవం సందర్భంగా బుర్గంపాడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గుర్తించి సత్కరించారు. జబర్దస్త్ ఫేం దొరబాబు రైజింగ్ రాజు చేతుల మీదుగా విశ్వామిత్ర చౌహాన్ అవార్డు అందుకున్నారు. నిర్వాహకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.