లక్ష్మీనగర్‌లో ఘనంగా వినాయకుడి
లడ్డూ వేలం, అన్నప్రసాద వితరణ
NEWS Sep 06,2025 10:24 am
బోడుప్పల్: లక్ష్మీనగర్ కాలనీ అసోసియేషన్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాలనీ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఉన్న వినాయక మండపానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. లడ్డూ వేలం కార్యక్రమం కూడా జరిగింది. అనంతరం వినాయక నిమజ్జనం కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకలో లక్ష్మీనగర్ కాలనీవాసులతో పాటు GBN Elite సభ్యులు పాల్గొన్నారు.