ఇండియా - ఎ జట్టు స్కిప్పర్ గా అయ్యర్
NEWS Sep 06,2025 03:46 pm
ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టు మ్యాచ్ లకు గాను ఇండియా -ఎ జట్టును ప్రకటించింది బీసీసీఐ. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను నియమించినట్లు తెలిపింది. వైస్ కెప్టెన్ ధ్రువ్ జురైల్ తో పాటు అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీసన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, హర్ష్ దుబే, ఆయుష్ బడోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యష్ ఠాకూర్ ను ఎంపిక చేసింది.