నిర్ణీత సమయానికే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
NEWS Sep 06,2025 09:57 am
హైదరాబాద్ : వినాయక ఉత్సవాల ముగింపులో భాగంగా శనివారం ఇక్కడి హుస్సేన్ సాగర్‌లో గణేష నిమజ్జనాలు ఘనంగా సాగుతున్నాయి. 69 అడుగుల ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిమజ్జనం చేశారు. ఆదివారం ఉదయం వరకు సుమారు లక్ష గణపతులు నిమజ్జనం జరుగుతాయని, 30 వేల మందితో బందోబస్తునిర్వహించామని పోలీసులు తెలిపారు.