ఏపీలో వైసీపీ రైతుల పక్షాన పోరాడనుంది. ఇందులో భాగంగా అన్నదాత పోరు పేరుతో పోస్టర్ ను ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆవిష్కరించారు. ఈనెల 9వ తేదీ నుంచి రైతు పోరు బాట కొనసాగుతుందన్నారు. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై వైసీపీ నిరసనలు చేపడుతుందన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.