ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్
NEWS Sep 06,2025 01:06 pm
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఈనెల 9వ తేదీన కీలకమైన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇందులో భాగంగా తాను కీలకమైన ఓటు వేయాల్సి ఉందని, తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 11వ తేదీన తమ ముందు లొంగి పోవాలని ఆదేశించింది.