బాలాపూర్ లడ్డూ@ రూ.35 లక్షలు
NEWS Sep 06,2025 11:38 am
హైదరాబాద్: బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది. వేలంలో రూ.35 లక్షలకు కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్ లడ్డూను సొంతం చేసుకున్నారు. 38 మంది పోటీ పడ్డారు. హోరాహోరీగా సాగిన ఈ వేలంలో చివరికి దీనిని దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. ఆయనకు నిర్వహకులు లడ్డూను అందించారు. గతేడాది కొలన్ శంకర్ రెడ్డి ఈ లడ్డూను రూ. 30.01 లక్షలకు దక్కించుకోగా, ఆ రికార్డును ఈ సారి సునాయాసంగా అధిగమించింది.