టికెట్ ధరలపై తక్కువ జీఎస్టీ ఉండాలి
NEWS Sep 06,2025 11:08 am
సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేంద్రం తీసుకు వచ్చిన జీఎస్టీ సంస్కరణలను స్వాగతించారు. సినిమా టికెట్ ధరలపై ఎక్కువ జీఎస్టీ ఉంటే ప్రేక్షకులు ఆదరించే ఛాన్స్ ఉండదన్నారు. సినిమా పరిశ్రమపై ఆధారపడిన వాళ్లు వేలల్లో ఉన్నారని, వారి కోసం తక్కువ పన్ను విధించేలా చూడాలని ప్రధాని మోదీకి విన్నవించారు.