మెట్రో రైల్ టెండర్లకు గడువు పొడిగింపు
NEWS Sep 06,2025 10:52 am
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లకు గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. విజయవాడ మెట్రో టెండర్ల గడువు అక్టోబర్ 14 వరకు, విశాఖ మెట్రో టెండర్ల గడువు అక్టోబర్ 7 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆసక్తి కలిగిన సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.