ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే పాయం
NEWS Sep 06,2025 12:30 pm
విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిదని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక మండలం జివిఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన జర్నలిస్టు వేడుకల్లో ఉపాధ్యాయులను సన్మానించారు. జర్నలిస్టులు ఉపాధ్యాయులు సత్కరించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుకున్న ఐదుగురిని శాలువాతో సన్మానించి, మెమంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.