వాహనదారులకు టాటా మోటర్స్ ఖుష్ కబర్
NEWS Sep 06,2025 09:45 am
ప్రముఖ వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ కీలక ప్రకటన చేసింది. వాహనదారులకు ఖుష్ కబర్ చెప్పింది. జీఎస్టీ ప్రయోజనాలు కల్పించేందుకు గాను వాహనాల ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రూ.75 వేల నుంచి రూ.1.45 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22 నుంచి అమల్లోకి కొత్త ధరలు రానున్నాయని వెల్లడించింది.