రాజంపేటలో చిరుత సంచారం
NEWS Sep 06,2025 09:45 am
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో చిరుత సంచారం స్థానికుల్లో భయాందోళన కలిగించింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఎస్.ఆర్. పాలెం సమీపంలో ఎస్.టి కాలనీ, ఏకో పార్క్ మధ్య రోడ్డుపై చిరుత దాటినట్లు సమాచారం. ఒక కానిస్టేబుల్ ప్రత్యక్షంగా చూశానని ధృవీకరించగా, రాయచోటి నుంచి రాజంపేటకు వస్తున్న ముగ్గురు వ్యక్తులు కూడా కళ్లారా చూశామని తెలిపారు. ఈ వార్త బయటకు రావడంతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతుండగా, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.