హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సవం
NEWS Sep 06,2025 08:42 am
భాగ్యనగరంలో గణనాథుల ర్యాలీ కొనసాగుతోంది. భారీ ఎత్తున వినాయక విగ్రహాలు తరలి వెళుతున్నాయి నిమజ్జనానికి. హుస్సేన్‌సాగర్‌తో పాటుపలు ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. 20 ప్రాంతాల్లో భారీ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌సారగ్ చుట్టూ నిమజ్జనానికి 30 క్రేన్లు ఏర్పాటు చేశారు. సరూర్‌నగర్, ఐడీపీఎల్, సఫిల్‌గూడ, సున్నం చెరువు సహా 20 చెరువులు, 72 కృత్రిమ కొలన్లలో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. 134 క్రేన్లు 259 మొబైల్ క్రేన్లతో నిమజ్జనం చేస్తారు. గ్రేటర్ వ్యాప్తంగా 303 కి.మీ. మేర శోభాయాత్రలు జరుగుతున్నాయి.