ఆరు నెలల్లో ఉప ఎన్నికలు పక్కా : కేటీఆర్
NEWS Sep 06,2025 08:38 am
మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని జోష్యం చెప్పారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే పదవి ఊడి పోవడం పక్కా అన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయన్నారు. గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళతామని ప్రకటించారు.