తెలంగాణ రైతాంగానికి కేంద్రం గుడ్ న్యూస్
NEWS Sep 06,2025 08:35 am
తెలంగాణ ప్రాంత రైతులకు తీపి కబురు చెప్పింది కేంద్రం. కేంద్ర మంత్రిని కలిశారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. తమకు యూరియా కేటాయించాలని కోరారు. ఈ మేరకు స్పందించిన కేంద్రం 11, 181 మెట్రిక్ టన్నుల యూరియాను పంపించింది. ఇవాళ సాయంత్రానికి మరో 9,039 మెట్రిక్ టన్నులల యూరియా రానుందని వెల్లడించారు. వచ్చే 20 రోజుల్లో రోజుకు 10 వేల మెట్రిక్ టన్నుల చొప్పున రాష్ట్రానికి యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తుమ్మల తెలిపారు.