కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ పై సీరియస్ గా స్పందించారు మాజీ మంత్రి హరీశ్ రావు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే పని చేయాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. తనపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని స్పష్టం చేశారు. కొందరు కావాలని తన వ్యక్తిగత ఇమేజ్ కు డ్యామేజ్ కలిగించేలా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.