15 నెలల తర్వాత తాడిపత్రికి పెద్దారెడ్డి
NEWS Sep 06,2025 08:26 am
తాడిపత్రిలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తాడిపత్రిలో కాలు మోపనున్నారు. తనను రానిచ్చేది లేదంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీంతో కోర్టును ఆశ్రయించారు కేతిరెడ్డి. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో 15 నెలల అనంతరం తాడిపత్రికి రానున్నారు కేతిరెడ్డి. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.